తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ అధికారులపై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. ఎఫ్‌సీఐపై మంత్రి రివ్యూ నిర్వహించారు. సమావేశంలో ఫుడ్ కార్పొరేషన్ పని తీరుపై సీతక్క అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు సొంత నిర్ణయాలు తీసుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. టెండర్లు లేకుండా నామినేష్ పద్దతిలో పనులు కేటాయించడం ఏంటని ప్రశ్నించారు. అధికారులంతా పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. బాల అమృతం ముడి సరుకుల్లో నాణ్యత లోపం ఉంటే సహించేది లేదని..నాసిక రకం సరుకులు సప్లై చేసే కాంట్రాక్టర్లు, వారికి సహకరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.