Srinivas Goud : డ్రగ్స్ వ్యాపారం చేస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తాం : మంత్రి శ్రీనివాస్‌గౌడ్
Srinivas Goud : డ్రగ్స్ వ్యాపారం చేస్తే పీడీ యాక్ట్‌లు నమోదు చేస్తామని, ఆవసరమైతే నగర బహిష్కరణ కూడా చేస్తామన్నారు హెచ్చరించారు మంత్రి శ్రీనివాస్‌గౌడ్.;
Srinivas Goud : డ్రగ్స్ వ్యాపారం చేస్తే పీడీ యాక్ట్‌లు నమోదు చేస్తామని, ఆవసరమైతే నగర బహిష్కరణ కూడా చేస్తామన్నారు హెచ్చరించారు మంత్రి శ్రీనివాస్‌గౌడ్. హైదరాబాద్‌లో డ్రగ్స్ దందా చేసేవాళ్లంతా రాష్ట్రం విడిచి వెళ్లి పోవాలని వార్నింగ్ ఇచ్చారు. పబ్బులలో డ్రగ్స్ కనిపించకూడదని చెప్పినా మళ్లీ మళ్లీ అవే రిపీట్ అవుతున్నాయని మంత్రి అహనం వ్యక్తంచేశారు. అవసరమైతే ఈ వ్యవస్థ మొత్తాన్ని రద్దు చేస్తామన్నారు. వీటితో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ముఖ్యం కాదని మంత్రి చెప్పుకొచ్చారు. ఒకవేళ పబ్ యజమానులు నిబంధనలు పాటించకపోతే ఎక్సైజ్ అధికారులే బాధ్యులు అవుతారన్నారు.
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రాడిసిన్ హోటల్ ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో డ్రగ్స్ పట్టుపడిన నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ నగరంలోని పబ్స్ యజమానులతో సమావేశమయ్యారు. బేగంపేట హరిత ప్లాజాలో హైదరాబాద్ పబ్ యజమానులతో ఎక్సైజ్ శాఖమంత్రి శ్రీనివాస్ గౌడ్ సమావేశమయ్యారు. పబ్స్‌లో డ్రగ్స్ కేసు నేపథ్యంలో సమావేశానికి ప్రధాన్యత సంతరించుకుంది. డ్రగ్స్ పై ప్రభుత్వం సీరియస్ గా ఉందని ఈసందర్బంగా మంత్రి వెల్లడించారు. పబ్స్ నిర్వాహణ, నియమనిబంధనలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి ఎక్సైజ్ శాఖ అధికారులతోపాటు.. ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు, పబ్ యజమానులు హాజరయ్యారు. ఇకనుంచి పబ్స్‌లో డ్రగ్స్ దొరికితే యజమానులతే బాధ్యత అని స్పష్టంచేశారు. దీంతో వారిపై ప్రభుత్వ చర్యలతోపాటు.. సీజ్‌చేసి క్రిమినల్ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
రాష్టం సుభిక్షంగా ఉండాలంటే డ్రగ్స్ ను నిర్ములించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో తమకు ఆదేశాలు ఇచ్చారన్నారు ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ ఖురేషి. పబ్ అండ్ బార్ లు ప్రభుత్వ నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు. స్థానికులకు ఇబ్బందులు కలగకుండా పబ్ నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మైనర్ల ను పబ్ లోకి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదన్నారు. అలా ఎవరైనా చేస్తే వెంటనే పబ్ సీజ్ చేస్తామని హెచ్చరించారు.
మాదక ద్రవ్యాల వ్యాపారం ఎవరు చేసినా వారి లైసెన్స్ రద్దు చేస్తామన్నారు ఎక్సైజ్ కమిషనర్ సర్పరాజ్.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల తర్వాత డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నామని హెచ్చించారు. ఇప్పటికే పబ్స్, బార్స్ పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసామని...పబ్, బార్ లు ప్రభుత్వం సూచించిన నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు. ప్రతి బార్ అండ్ పబ్ లలో తప్పకుండా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము.. మైనర్లను బార్ అండ్ పబ్ లకు అనుమతించకూడదు..దీనికి పూర్తి బాధ్యత యాజమాన్యం వహించాలన్నారు. డార్క్ రూమ్స్ లో కూడా కెమెరాలు ఉండాలని సూచించారు.
ఈ సమావేశంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పబ్ యజమానులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. కొంతమంది డబ్బుకు కక్కుర్తి పడటంతో రాష్ట్రానికి చెడుపేరు వస్తుందన్నారు. గతంలో పేకాట, గుడంబాను అరికట్టామని.. ఇప్పుడు అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎవరిని వదిలిపెట్టమన్నారు. ఇకనుంచి డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నవారిపై పిడీయాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని మంత్రి హెచ్చరించారు. అవసరమైతే నగర బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు.
డ్రగ్స్ విషయంలో పబ్‌ల వ్యవహారంలో మార్పురాకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోక పోవడంతో మొత్తం ఈ వ్యవస్థను రద్దుచేస్తామన్నారు. ఇక నుంచి సీసీటీవీలు లేని పబ్‌లను మూసివేస్తామ మంత్రి తెలియ జేశారు. పబ్‌లో ఏర్పాటు చేసిన ప్రతి కెమెరాను పోలీసు శాఖకు అనుసంధానం చేయాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పబ్ యజమానులకు సూచించారు. దీనివల్ల రెగ్యులర్‌గా పబ్‌కు వచ్చే వారి సమాచారం సేకరించడం సులభమవుతుందన్నారు. ఎక్కడైనా పబ్ యజమానులు ఈ డ్రగ్స్ నిబంధనలు పాటించకపోతే అందుకు ఎక్సైజ్ శాఖ అధికారులను బాధ్యులను చేయనున్నట్లు స్పష్టం చేశారు. పబ్‌లో ఏర్పాటుచేసే సౌండ్ సిస్టం పక్కన ఉన్నవారికి ఇబ్బందులు కల్గకుండా చూసుకోవాలన్నారు.
Held a high level review meeting with the Managements of pubs & bars at Tourism Plaza Hotel in Begumpet & informed that stern action will be taken if drug usage is found in any of the establishments. pic.twitter.com/PMoSf23Rwm
— V Srinivas Goud (@VSrinivasGoud) April 9, 2022
ఇక నుంచి పబ్‌లు వీక్‌డేస్‌లో రాత్రి 12గంటల వరకు, వీకెండ్‌లో శుక్ర,శని, ఆదివారాలు రాత్రి 1గంటవరకు మూసివేయాలని మంత్రి పబ్ నిర్వాహకులకు సూచించారు. 24 గంటల పర్మిషన్ ఉన్న హోటల్స్ లో స్పెషల్ ఈవెంట్స్ చేయకుండా.....కేవలం సర్వీస్ ఓరియెంటెడ్ మాత్రమే నిర్వహించుకోవాలని మంత్రి వెల్లడించారు. వీటి పైన ఎల్లప్పుడు ఎక్సైజ్, టాస్క్ ఫోర్స్ నిఘా ఉంటుందని మంత్రి స్పష్టంచేశారు. ఇకనుంచి ఏ పబ్బును వదిలేది లేదన్నారు. ఎవరు ఫోన్ చేసినా వినకుండా నిబంధనలు పాటించని పబ్‌పై చర్యలు తీసుకోవాలని సియం కేసీఆర్ ఆదేశించినట్లు మంత్రిపేర్కొన్నారు.
మాదక ద్రవ్యాల కేసులను చాకచక్యంగా పట్టుకున్న పోలీస్, ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ లోని అధికారులకు ప్రమోషన్ ఇవ్వాలని కేసీఆర్ సూచించినట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. ఏ ఏ మార్గాల నుంచి డ్రగ్స్ వస్తున్నాయో .. ఆ డెలివరి సంస్థలో మాట్లాడి చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.