ఈటల రాజేందర్ అహంకారపూరిత మాటలు మానుకోవాలి : మంత్రి తలసాని
ఈటల రాజేందర్ అహంకార పూరిత మాటలు మానుకోవాలని హితవు పలికారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.;
ఈటల రాజేందర్ అహంకార పూరిత మాటలు మానుకోవాలని హితవు పలికారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తెలంగాణ ఉద్యమకారుడు గెల్లు శ్రీనివాస్‌పై ఈటల చేసిన కామెంట్స్‌ను తలసాని ఖండించారు. ఈటల హుజురాబాద్ వెళితే బీసీగా.. శామిర్ పేట వస్తే మరోలా వ్యవహరిస్తరంటూ తలసాని ఆరోపించారు. ఉద్యమ కారులకు టీఆర్‌ఎస్ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. బీజేపీ నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడటం సరైంది కాదన్నారు. ఏది ఏమైనా గెల్లు శ్రీనివాస్ గెలువడం ఖాయమన్నారు.