సూర్యాపేట: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్కు ప్రమాదం తప్పింది. ఉత్తమ్ హెలికాప్టర్ కోదాడలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. వాతావరణ శాఖ అధికారుల సూచన మేరకు అత్యవసరంగా ల్యాండ్ అయినట్టు తెలుస్తోంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ టూర్ నేపథ్యం లో హుజూర్ నగర్ మండలం మేళ్లచెరువులో హెలికాఫ్టర్ ల్యాండ్ కావాల్సి ఉండగా..వాతావరణశాఖ అధికారుల సూచన మేరకు అత్యవస రంగా ల్యాండ్ చేశారు. కమ్ముకున్న మబ్బులు, గాలివాన నేపథ్యంలో పైలట్ అప్రమత్తమయ్యారు. దీంతో, అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అనంతరం, మంత్రి ఉత్తమ్ కుమార్.. కోదాడ నుంచి హుజూర్ నగర్ కు రోడ్డు మార్గంలో వెళ్లిపోయారు.