Minister KTR : ఓల్డ్ మారేడ్‌పల్లిలో డబుల్ బెడ్‌రూం ఇళ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
Minister KTR : సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి కేటీఆర్... ఓల్డ్ మారేడ్‌పల్లిలో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లను ప్రారంభించారు;
Minister KTR : సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి కేటీఆర్... ఓల్డ్ మారేడ్‌పల్లిలో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లను ప్రారంభించారు. 5 ఎకరాల స్థలంలో 468 డబుల్ బెడ్‌రూం ఇళ్లను జీహెచ్ఎంసీ నిర్మించింది. డబుల్ బెడ్‌రూం ఇళ్ల పట్టాలను లబ్దిదారులకు కేటీఆర్ అందజేశారు. ఒక్క హైదరాబాద్‌లోనే లక్ష డబుల్ బెడ్‌రూం ఇళ్లను కడుతున్నామని, తెలంగాణ వ్యాప్తంగా 18 వేల కోట్ల రుపాయలతో రెండు లక్షల 75వేల డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. ప్రస్తుత మార్కెట్‌లో కోటి రుపాయల విలువ చేసే డబుల్ బెడ్‌రూం ఇళ్లను ఉచితంగా అందజేస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు.