MINISTERS: మేడారంలో ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు
రేపు విగ్రహాల పున: ప్రతిష్ట
ములుగు జిల్లా మేడారంలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క పర్యటించారు. తొలుత వనదేవతలు సమ్మక్క, సారలమ్మలను వారు దర్శించుకున్నారు. అనంతరం మేడారం మహాజాతర ఏర్పాట్లు, అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రులు పలు సూచనలు చేశారు. జనవరి 28 నుంచి 31 వరకు మేడారం జాతర జరగనుంది.
వేములవాడలో భక్తుల రద్దీ
సమ్మక్క, సారలమ్మ అమ్మవార్ల జాతర షురూ కావడంతో వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అనుబంధ ఆలయాలైన శ్రీ భీమేశ్వర ఆలయం, శ్రీ బద్ది పోచమ్మ ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. జాతర సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవార్లను, స్వామివారిని దర్శించుకున్నారు. భీమేశ్వర ఆలయంలో కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈవో ఎల్. రమాదేవి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకున్నారు.
మరో నెల రోజుల్లో మేడారం మహా జాతర ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భక్తులు గత నెలరోజులుగా వేల సంఖ్యలో మేడారం చేరుకొని సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుంటున్నారు. దీంతో మేడారం పరిసర ప్రాంతాలు భక్తులతో కోలాహలంగా మారిపోయాయి. అయితే భక్తులకు మేడారం ఆలయ సిబ్బంది బిగ్ అలర్ట్ జారీ చేశారు. ములుగు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మేడారంలో రేపు (బుధవారం) సమ్మక్క-సారలమ్మల దర్శనాలను నిలిపివేస్తున్నట్లు పూజారుల సంఘం ప్రకటించింది. ఆలయ గద్దెల వద్ద జరుగుతున్న కొన్ని ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అభివృద్ధి పనుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పూజారుల సంఘం అధ్యక్షుడు వెల్లడించారు.