బీజేపీపై నిప్పులు చెరిగిన మంత్రి హరీష్‌రావు..!
బీజేపీ రోజురోజుకు దిగజారిపోతుందని విమర్శించారు మంత్రి హరీష్‌రావు. కేంద్ర మంత్రివర్గం మొత్తం బెంగాల్‌లో మకాం వేసినా.. వంద సీట్లు కూడా సాధించలేకపోయారన్నారు.;
బీజేపీ రోజురోజుకు దిగజారిపోతుందని విమర్శించారు మంత్రి హరీష్‌రావు. కేంద్ర మంత్రివర్గం మొత్తం బెంగాల్‌లో మకాం వేసినా.. వంద సీట్లు కూడా సాధించలేకపోయారన్నారు. సాగర్ ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాలేదన్నారు. కరోనా కట్టడిలో కేంద్రం విఫలమైందని.. ప్రపంచ దేశాల ముందు పరువు పోయేలా చేశారని ఆరోపించారు. దుబ్బాక, జీహెచ్‌ఎంసీలో బీజేపీ విజయం పాలపొంగులాంటిదేనన్నారు హరీష్. కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదని.. ఫలితంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందన్నారు.