పటాన్ చెరులో కాంగ్రెస్ నేతలు రోడ్డెక్కారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సేవ్ కాంగ్రెస్ .. సేవ్ పటాన్ చెరు స్లోగన్‌తో కార్యకర్తలు, నాయకులు రోడ్డుపై బైఠాయించారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి దిష్టిబొమ్మను తగులబెట్టారు. పార్టీ మారి వచ్చిన గూడెం పాత కాంగ్రెస్ నాయకులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. పాత, కొత్త నేతల పంచాయితీని అగ్రనేతలు సర్దుబాటు చేయాలని డిమాండ్ చేశారు. గూడెం మహిపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చెయాలని రోడ్డుపై కాంగ్రెస్ నేతలు మెరుపు ధర్నాకు దిగారు. అనంతరం క్యాంప్ ఆఫీస్‌లోని కుర్చీలను ధ్వంసం చేశారు.