పీసీసీ చీఫ్‌గా రేవంత్.. మొక్కులు చెల్లించుకున్న ఎమ్మెల్యే సీతక్క..!
రేవంత్‌రెడ్డిని పీసీసీ చీఫ్‌గా నియమించడంతో మొక్కులు చెల్లించుకున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క.;
రేవంత్‌రెడ్డిని పీసీసీ చీఫ్‌గా నియమించడంతో మొక్కులు చెల్లించుకున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. తెలంగాణ కాంగ్రెస్ సారథ్య బాధ్యతలను రేవంత్‌కే దక్కాలంటూ మేడారం సమ్మక్క సారలమ్మకు మొక్కుకున్నానని, అది ఫలించడంతో మొక్కులు చెల్లించుకున్నానని చెప్పుకొచ్చారు. తెలంగాణలోని మెజారిటీ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డి నాయకత్వాన్నే కోరుకున్నారన్నారు సీతక్క. పీసీసీ విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నా.. అధిష్టానం మాత్రం రేవంత్‌రెడ్డికే బాధ్యతలు అప్పగించిందన్నారు.