న్యాయవాది దంపతుల హత్య : నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి: శ్రీధర్ బాబు

పెద్దపల్లిలో న్యాయవాది వామన్ రావు దంపతుల దారుణ హత్యను కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి శ్రీధర్ బాబు ఖండించారు.

Update: 2021-02-17 15:04 GMT

పెద్దపల్లిలో న్యాయవాది వామన్ రావు దంపతుల దారుణ హత్యను కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి శ్రీధర్ బాబు ఖండించారు. ఈ ఘటనలో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రామగుండం పరిధిలో రౌడీయిజం, గూండాయిజం పెరిగిపోయిందని.. దీనిపై పోలీసులకు అనేక సార్లు ఫిర్యాదు చేశామన్నారు శ్రీధర్ బాబు. న్యాయవాది దంపతుల హత్యపై విచారణ చేపట్టి నిజానిజాలను బయటపెట్టాలని శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు.

Tags:    

Similar News