TS : ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం

Update: 2024-05-27 03:51 GMT

ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 వరకు పోలింగ్ కొనసాగనుంది. 34 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4.63 లక్షలమంది గ్రాడ్యుయేట్లు ఓటు వేయనున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో కలిపి 52మంది బరిలో ఉన్నారు. కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేశ్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు.

ఈ ఎన్నికకు నల్గొండ జిల్లా కలెక్టర్‌ దాసరి హరిచందన రిటర్నింగ్‌ అధికారి(ఆర్వో)గా వ్యవహరిస్తున్నారు. జూన్‌ 5వ తేదీన కౌంటింగ్‌ ఉండనుంది. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 2021 మార్చిలో జరిగిన ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం సాధించారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఈ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

Tags:    

Similar News