MLC Kavitha: దేవుడి పేరుతో రాజకీయం చేస్తే ఊరుకునేది లేదు: ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: మోదీ పాలనలో సామాన్యులు జీవించడం కష్టంగా మారిందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు.;
MLC Kavitha: మోదీ పాలనలో సామాన్యులు జీవించడం కష్టంగా మారిందని, బీజేపీ హామీలు ఆకాశంలో ఉంటే.. వాటి అమలు పాతాళంలో ఉందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. తెలంగాణను దేశంలో నంబర్ వన్‌గా నిలిపిన పార్టీ టీఆర్‌ఎస్ అని, ఈ విషయాన్ని సగర్వంగా ప్రతిపక్షాలకు చెప్పాలని కార్యకర్తలకు ఆమె పిలుపునిచ్చారు. దేవుడి పేరుతో రాజకీయం చేస్తే ఊరుకునేది లేదని, వాళ్లు జై శ్రీరాం అంటే.. మనం జై హనుమాన్ అనాలని సూచించారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని గండి హనుమాన్ దేవస్థానంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. కొండగట్టు దేవస్థానాన్ని సందర్శించి, హనుమాన్ చాలీసా పారాయణంలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మోదీ పాలనలో జీడీపీ నేల మీదకి వచ్చిందని దుయ్యబట్టారు.