ఎమ్మెల్సీ కవిత కాన్వాయ్‌లో ఢీకొన్న కార్లు..!
సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటనలో నాయకుల కార్లు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. కవిత కాన్వాయ్ వెనుక వస్తున్న నాయకుల కార్లు వరుసగా తాకాయి.;
సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటనలో నాయకుల కార్లు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. కవిత కాన్వాయ్ వెనుక వస్తున్న నాయకుల కార్లు వరుసగా తాకాయి. ఈ ఘటనలో చొప్పదండి ఎమ్మెల్యే కారు సహా పదికార్లు డ్యామేజ్ అయ్యాయి. కాన్వాయ్‌లోని ముందు వాహనం ఒక్కసారిగా స్లో కావడంతో... దాన్ని అనుసరిస్తున్న వాహనాలు ఒకదాని కొకటి ఢీకొన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికేం గాయాలేం కాలేదని తెలుస్తోంది.