తెలంగాణలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి కీలక విషయాలు వస్తున్నాయి. మాజీ డీసీపీ రాధాకిషన్ కన్ఫెషన్ స్టేట్మెంట్‌లో మరోసారి సంచలన విషయాలు బయటపడ్డాయి. గతంలో బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన BRS ఎమ్మెల్యేల ఫోన్లు ప్రభాకర్‌రావు ట్యాప్ చేసినట్టుగా రాధాకిషన్ రావు చెప్పారు. రోహిత్‌రెడ్డితో పాటు కొంత మంది బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన వాంగ్మూలంలో గుర్తించారు.
పైలట్ రోహిత్‌రెడ్డి ఆడియోలను ముందు పెట్టి ఎమ్మెల్యేల కొనుగోలుకు తెరతీశారని తెలిసింది. పైలట్ రోహిత్‌రెడ్డి స్కెచ్ ప్రకారం మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో చర్చలు జరిగాయని.. మధ్యవర్తి నందు ఫోన్లు ట్యాప్ చేయడంతో ఎమ్మెల్యేల కోనుగోలు వ్యవహారం బయటకు వచ్చిందని.. MLAల కొనుగోలు కేసులో BL సంతోష్‌ను అరెస్ట్ చేయాలని మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని తెలిసింది.
బీఎల్ సంతోష్‌ను అడ్డంపెట్టుకుని లిక్కర్ స్కాం నుంచి కవితను తప్పించాలని ప్లాన్ చేసినట్టు పోలీసులకు సమాచారం అందింది.. బీఎల్ సంతోష్‌ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు విఫలం కావడంతో కేసీఆర్ ఆగ్రహించారని సమాచారం. MLAల కొనుగోలుకు పెద్ద ఎత్తున స్పై కెమరాలు, ఆడియో డివైజ్‌లను ప్రభాకర్‌రావు కొనుగోలు చేశారని.. ఇన్‌స్పెక్టర్ శ్రీనాథ్‌రెడ్డి సహకారంతో ఢిల్లీలో అధునాతన పరికరాలు కొన్నారని తెలిసింది.