Congress MLC Race : కాంగ్రెస్ ఎమ్మెల్సీ రేసులో 20 మందికి పైగా పోటీ

Update: 2025-02-26 13:15 GMT

కాంగ్రెస్ పార్టీ నుంచి 20 మందికి పైగా ఎమ్మెల్సీ ఛాన్స్ కోసం పోటీ పడుతున్నారు. ఇందులో అద్దంకి దయాకర్ పేరు ముందు వరుసలో ఉంది. తనను చట్టసభకు పంపిస్తానని రేవంత్ రెడ్డి ఇప్పటికే హామీ ఇచ్చారని ఆయన తన సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నారు. సీనియర్ నేతలు జగ్గారెడ్డి, జీవన్ రెడ్డి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ తదితరులు తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అయితే.. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో ఓడిపోయిన వారికి ఇప్పుడు ఎమ్మెల్సీ ఛాన్స్ ఇవ్వకూడదని హైకమాండ్ నిబంధన పెట్టి నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ముగ్గురికి అవకాశం కష్టమేనన్న ప్రచారం సాగుతోంది. ఇందుకు సంబంధించి తాజాగా టీపీసీసీ అధ్యక్షుడికి ఏఐసీసీ నుంచి అంతర్గత మార్గదర్శకాలు అందినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News