Nagarkurnool : కరెంట్ షాక్ తో తల్లీకొడుకు మృతి

Update: 2025-05-02 05:45 GMT

పిండి దుకాణంలో విద్యుత్ షాక్ కు గురై తల్లీ కొడుకు మృతి చెందారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. తాడూరు మండలం తుమ్మల సుగర్ గ్రామానికి చెందిన జయమ్మ(40) కొడుకు శ్రీకాంత్ (15) గ్రామంలో పిండి గిరి దుకాణం నడుపుతున్నారు. ఇవాళ పిండి గిర్నీ లో షార్ట్ సర్క్యూట్ రావడంతో తల్లీ, కొడుకు మృతి చెందారు. స్థానికులు గమనించి 108 తో నాగర్ కర్నూల్ హాస్పిటల్ కు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరిం చారు. ఇద్దరు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Tags:    

Similar News