MP Raghunandan : సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ రఘునందన్ రావు బహిరంగ లేఖ

Update: 2025-07-10 12:00 GMT

మెదక్ ఎంపీ రఘునందన్ రావు సీఎం రేవంత్ రెడ్డి కి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఆయన అభినందించారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు ఈ పథకం లబ్ధి చేకూరుస్తుంది అన్నారు. అయితే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకంలో ఎంపీలకు 40 శాతం కోటా కేటాయించాలని సీఎం ను కోరారు రఘునందన్ రావు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన లేఖలో ఈ విషయాన్ని పొందుపరిచారు.

ఇందిరమ్మ ఇండ్ల పథకానికి... ప్రధాన మంత్రి ఆవాస్ యోజన నిధులను అనుసంధానించడం సానుకూలమైన పరిణామం అని అన్నారు. లబ్దిదారుల ఎంపికలో స్థానిక ఎమ్మెల్యేలకు 40 శాతం కోటా కేటాయిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయం అన్నారు. ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వడం మంచి నిర్ణయమని అలాగే ప్రజల మద్దతుతో గెలిచిన 17 మంది ఎంపీలకు కూడా మరో 40% కోటా కేటాయించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

ఈ నిర్ణయం ద్వారా పార్టీలకు అతీతంగా అందరికీ సమాన అవకాశాలను అందుతాయని, కేంద్ర-రాష్ట్ర భాగస్వామ్యంతో అమలవుతున్న ఈ పథకంలో లబ్ధిదారుల ఎంపిక మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా సాగేందుకు దోహదపడుతుందన్నారు. ఎంపీలను కూడా గౌరవిస్తూ ముఖ్యమంత్రి సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు రఘునందన్ రావు పేర్కొన్నారు.

Tags:    

Similar News