ములుగు ఎమ్మెల్యే సీతక్కకు అస్వస్థత

దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర యాత్రలో పాల్గొన్న ములుగు ఎమ్మెల్యే సీతక్క అస్వస్థతకు గురయ్యారు.

Update: 2021-09-21 12:00 GMT

దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర యాత్రలో పాల్గొన్న ములుగు ఎమ్మెల్యే సీతక్క అస్వస్థతకు గురయ్యారు. ఏటూరు నాగారంలోని దళిత గిరజన దండోరా పాదయాత్ర నిర్వహించిన సీతక్క... 4 కిలోమీటర్ల ర్యాలీగా నడిచి వేళ్లారు. అయితే ఎమ్మార్వో కార్యాలయానికి చేరుకున్న ఆమె... ఒక్కసారి కళ్లు తిరిగి కింద పడిపోయారు. వెంటనే అక్కడివారంతా ఎమ్మెల్యే సీతక్కను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందించిన డాక్టర్లు... ప్రస్తుతం సీతక్క ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు.

Similar News