కేంద్రవ్యవసాయ చట్టాలపై ఎంపీ నామా నాగేశ్వర్‌ రావు ఆగ్రహం

Update: 2020-12-08 14:52 GMT

కేంద్రం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాలకు నిరసనగా ఖమ్మంలో జరిగిన భారత్‌ బంద్‌లో.. ఎంపీ నామా నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు. మంత్రి అజయ్‌తో పాటు టీఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఈ నిరసనకు హాజరయ్యారు. ‌కేంద్రం చట్టాలపై నామా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చట్టాలు అమలైతే అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని మండిపడ్డారు.

కేంద్రం కొత్త వ్యవసాయ చట్టాలను టీఆర్‌ఎస్‌ పార్టీ మొదట్నుంచి వ్యతిరేకిస్తోంది. లోక్‌సభలో బిల్లులను ప్రవేశపెట్టినప్పుడే.. పార్టీ పార్టీమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వర్‌రావు వీటిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ బిల్లులు రైతుల రక్తాన్ని తాగేలా ఉన్నాయంటూ మండిపడ్డారు. విపక్ష ఎంపీలతో కలిసి పార్లమెంటులో ఆందోళన చేపట్టారు.

లోక్‌సభలో సైతం ఈ బిల్లులపై నామా నిరసన గళం వినిపించారు. కేంద్రం బిల్లుపై అన్ని పక్షాల సమ్మతి తీసుకోవాలని సూచించారు.


Tags:    

Similar News