NARA LOKESH: "కొనసాగుతున్న ఆపరేషన్ నేపాల్"

అందర్నీ కాపాడతామన్న నారా లోకేశ్

Update: 2025-09-12 05:00 GMT

నే­పా­ల్‌­లో చి­క్కు­కు­న్న ఏపీ వా­సు­ల­ను సు­ర­క్షి­తం­గా రా­ష్ట్రా­ని­కి తీ­సు­కు­వ­చ్చేం­దు­కు మం­త్రి నారా లో­కే­శ్‌ చే­స్తు­న్న కృషి ఫలి­స్తోం­ది. మం­త్రి చొ­ర­వ­తో అధి­కా­రు­లు చర్య­లు చే­ప­ట్టా­రు. నే­పా­ల్‌ నుం­చి పలు­వు­రు యా­త్రి కులు ఇప్ప­టి­కే ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­కు బయ­ల్దే­రా­రు. సి­మి­కో­ట్‌­లో చి­క్కు­కు­న్న 12 మం­ది­ని ప్ర­త్యేక వి­మా­నం­లో అధి­కా­రు­లు ఉత్త­ర్‌­ప్ర­దే­శ్ సరి­హ­ద్దు సమీ­పం­లో ఉన్న నే­పా­ల్ గంజ్ ఎయి­ర్‌­పో­ర్ట్‌­కు తర­లిం­చా­రు. అక్క­డి నుం­చి ఏపీ ప్ర­భు­త్వం ఏర్పా­టు చే­సిన వా­హ­నా­ల్లో లఖ్‌­న­వూ చే­రు­కు­న్నా­రు. లఖ్‌­న­వూ నుం­చి హై­ద­రా­బా­ద్‌­కు వి­మా­నం­లో తీ­సు­కొ­చ్చేం­దు­కు ఏర్పా­ట్లు చే­స్తు­న్నా­రు. కా­ఠ్‌­మం­డూ సమీ­పం­లో చి­క్కు­కు­న్న తె­లు­గు­వా­రి­ని సు­ర­క్షి­తం­గా రా­ష్ట్రా­ని­కి తీ­సు­కు­రా­వ­డా­ని­కి అధి­కా­రు­ల­తో సమ­న్వ­యం చేసి లో­కే­శ్‌ ప్ర­త్యేక వి­మా­నం ఏర్పా­టు­చే­శా­రు. నే­పా­ల్‌­లో చి­క్కు­కు­న్న వారు రా­ష్ట్రా­ని­కి సు­ర­క్షి­తం­గా తి­రి­గి­వ­చ్చి ఇళ్ల­కు చేరే వరకూ సం­బం­ధిత అధి­కా­రు­లు అంతా అప్ర­మ­త్తం­గా ఉం­డా­ల­ని మం­త్రి ఆదే­శిం­చిన వి­ష­యం తె­లి­సిం­దే.

మంత్రి నారా లోకేశ్ చొరవ


ఏపీ మం­త్రి నారా లో­కే­శ్‌ చొ­ర­వ­తో ఏపీ వా­సు­లు నే­పా­ల్‌­లో­ని కా­ఠ్‌­మాం­డూ వి­మా­నా­శ్ర­యం నుం­చి స్వ­దే­శా­ని­కి వచ్చా­రు. ఏపీ ప్ర­భు­త్వం ఏర్పా­టు చే­సిన ప్ర­త్యేక వి­మా­నం­లో 144 మంది తి­రి­గి వచ్చా­రు. కా­ఠ్‌­మాం­డూ నుం­చి ప్ర­త్యేక వి­మా­నం మొ­ద­ట­గా వి­శాఖ, ఆ తర్వాత తి­రు­ప­తి వి­మా­నా­శ్ర­యా­ని­కి చే­రు­కుం­ది.

Tags:    

Similar News