Hyderabad : యువకుడి ప్రాణం తీసిన ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యం..

Update: 2025-08-06 12:45 GMT

వాటర్ ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యం ఓ యువకుడి ప్రాణాలు తీసింది. హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన ఈ యాక్సిడెంట్ స్థానికంగా విషాదాన్ని నింపింది. ప్రగతినగర్ ఎల్పీ సర్కిల్ లో ఓ వాటర్ ట్యాంకర్ డ్రైవర్ ర్యాష్ గా డ్రైవ్ చేస్తూ ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీ కొట్టాడు. దీంతో బైక్ పై ఉన్న విద్యార్థి తీవ్రగాయాలతో స్పాట్ లోనే చనిపోయాడు. స్థానికుల సమాచారం తో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతుడు మూసాపేటకు చెందిన నిఖిల్ గా గుర్తించారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే వాటర్ ట్యాంకర్ ను అక్కడే వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కాగా నగరంలో చాలా చోట్ల వాటర్ ప్రాబ్లం ఉండడంతో ఎక్కువ మంది వాటర్ ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. లాభాల కోసం ఎక్కువ ట్రిప్పులు వేయాలనే ఉద్దేశంతో ఇష్టం వచ్చినట్లుగా డ్రైవ్ చేస్తూ ఆక్సిడెంట్ లకు కారణం అవుతున్నారు వాటర్ ట్యాంకర్ డ్రైవర్లు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Tags:    

Similar News