నియోజకవర్గాల పునర్విభజనతో కొత్త వారికి మంచి అవకాశాలు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిన్న పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన నాయకత్వానికి 2029వేదికగా మారబోతోందని చెప్పారు. తాను పీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలో 45 లక్షల క్రియాశీలక సభ్యత్వాలు చేయించినట్టు చెప్పారు. పార్టీ పదవులను లైట్ గా తీసుకో వద్దని, వాటితోనే గుర్తింపు గౌరవం వస్తాయని అన్నారు. రాజకీయ ఎదుగుదలకు అవి ఉపయోగపడతాయని అన్నారు. రాబోయే రోజుల్లో అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు పెరగబోతున్నాయని, మహిళా= రిజర్వేషన్, జమిలి ఎన్నికలు రాజకీయా లను ప్రభావితం చేయబోతున్నాయని అన్నారు. ఈ క్రమంలో పార్టీ నేతలకు మంచి అవకాశాలు వస్తాయని వివరించారు. నాయకులుగా ఎదగాలంటే ఇప్పటి నుంచే కష్టపడాలని సూచించారు. గ్రామాలకు వెళ్లి క్షేత్ర స్థాయిలో పర్యటించాలని అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిం చాలని సూచించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి కులగణన చే యించడంలో మనం సక్సెస్ అయ్యామని సీఎం అన్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మనం చాలా విజయాలు సాధించామని, వాటన్నింటి నీ ప్రజలకు వివరించాలని కోరారు. ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగి రెండో సారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని సీఎం అన్నారు. సుదీర్ఘకాలం ప్రజాప్రతినిధిగా ఎన్నికైన అరుదైన ఘనత ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే దని, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలని సీఎం సూచించారు.