జగిత్యాల జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. జాబితాపూర్ గ్రామానికి చెందిన కాటిపెల్లి నిత్య(21) హైదరాబాద్ కేపీహెచ్బీ ప్రాంతంలో ఓ ప్రైవేట్ వసతి గృహంలో ఉంటూ బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. . హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలోని ప్రైవేటు హస్టల్లో ఉంటూ అక్కడి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. ఇటీవల నిత్య చదువులో వెనుబడింది. ఈ విషయంలోనే ఆమె స్నేహితురాళ్లు సంజన, వైష్ణవి అవమానించినట్లు మాట్లాడారు. దీంతో మనస్థాపానికి గురైన నిత్య ఇంటికి వచ్చేసింది. వచ్చినప్పటి నుంచి దిగులుగా ఉంటున్న నిత్య ఈ నెల 2న గడ్డి మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు కరీంనగర్లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తుంచారు. కాగా చికిత్స పొందుతూ నిత్య మృతి చెందింది. కూతురు ఆత్మహత్యకు పాల్పడడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.