ప్రజలు వరద పరిస్థితుల్లో సెల్సీల పేరుతో ఇబ్బందులకు గురికావొద్దని, ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సీఎస్ శాంతి కుమారి విజ్ఞప్తి చేశారు. వాగులు, నదులు పొంగి పొర్లుతుంటే పలుచోట్ల ప్రజలు వంతెనలు ఎక్కి చూడడం, సెల్ఫీలు తీసుకోవడం వంటివి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. క్లిష్ట సమయంలో ఎక్కడైనా బ్రిడ్జి, వంతెన కొట్టుక పోతే జరిగే ప్రాణనష్టం చాలా ఎక్కువగా ఉంటుంది.
ఇప్పటికే ఈ విధమైన సంఘటనలు అక్కడక్కడా ఎదురవుతున్నాయి. దయచేసి వాగులు చెరువులు నదుల వద్దకు వెళ్లవద్దని, ముఖ్యంగా సెల్ఫీలు ఫోటోగ్రాఫ్లను తీసుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. అని సీఎస్ శాంతికుమారి పిలుపునిచ్చారు.