బీజేపీ చేరుతున్నానన్న వార్తల్లో నిజం లేదు - మాజీ ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి
టీఆర్‌ఎస్‌కు ఎప్పటికైనా కాంగ్రెస్సే ప్రత్యామ్నాయమన్నారు మాజీ ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి. తాము ప్రత్యామ్నాయం అంటున్న బీజేపీ నేతల మాటల్లో వాస్తవాలు లేవన్నారు. గ్రేటర్‌లో బీజేపీ ఆశించిన మేర ఫలితాలు ఉండకపోవచ్చన్నారాయన. దుబ్బాకతో పోలీస్తే.... గ్రేటర్‌లో ఫలితం వేరుగా ఉంటుందన్నారు. తాను బీజేపీలో చేరుతున్నాననే వార్తల్లో నిజం లేదన్నారు. గ్రేటర్‌లో మెజారిటీ సీట్లు గెలిచి కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామన్నారు విశ్వేశ్వర్‌రెడ్డి.