TS: త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ

Update: 2025-03-01 05:00 GMT

తెలంగాణలో త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. వివిధ జిల్లాలలో ఖాళీగా ఉన్న కార్పొరేషన్లు, మార్కెట్ కమిటీలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయాల్సి ఉందని, మార్చి 10వ తేదీలోగా అన్ని జిల్లాలలో నియామకాలు ఇచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రులకు సీఎం ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వారికి ఆమె రాకతో మంచి రోజులు రాబోతున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీ కోసం సుదీర్ఘకాలం కష్టపడి పనిచేసినా.. కొంతమందికి అవకాశాలు రాలేదన్నారు. రాబోయే రోజుల్లో వారికి తప్పకుండా ప్రాధాన్యమిస్తామని స్పష్టం చేశారు. నామినేటెడ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన వారి పేర్లతో మార్చి 10లోగా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు ప్రతిపాదనలు పంపాలని రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పదవులు వచ్చిన వారు పార్టీ కోసం కష్టపడాలని, అప్పుడే పార్టీ బలోపేతం అవుతుందన్నారు. పనితీరు సక్రమంగా లేని నాయకులకు ఎట్టి పరిస్థితుల్లో పదవుల రెన్యువల్ ఉండదని సీఎం తేల్చిచెప్పారు. మంచిని మైక్ లో చెప్పండి.. చెడును చెవిలో చెప్పాలని సీఎం ఈ సందర్భంగా కార్యకర్తలకు సూచించారు.

Tags:    

Similar News