నల్గొండ- ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. గురువారంతో నామినేషన్లు ముగియగా, నేడు నామినేషన్ల పరిశీలన పూర్తి చేయనున్నారు. ఈ నెల 13 వరకు ఉపసంహరణ గడువును ఈసీ నిర్దేశిం చింది. ఈ నెల 27న ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగ నుంది. ఫ లితాలను జూన్ 5న ప్రకటించనున్నారు.
కాగా నల్గొండ- ఖమ్మం- వరంగల్ స్థానానికి ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్రెడ్డి 2021లో ఎన్నికకాగా, 2027 వరకు ఆయన పదవీ కాలం ఉంది. అయితే గతేడాది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ నుం చి జనగామ ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో డిసెంబర్ 9న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈసీ నోటిఫికేషన్ జారీ చేయడంతో ప్రధాన పార్టీలు తమతమ అభ్యర్ధులను ప్రకటించి రంగంలోకి దిగాయి.
కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నను బరిలోకి దింపగా, బీఆర్ఎస్ ఏనుగుల రాకేశ్ రెడ్డిని, బీజేపీ ప్రేమేందర్రెడ్డిలను రంగంలోకి దింపాయి. ఆయా పార్టీల అభ్యర్థులు తాజాగా నామినేషన్లను సమర్పించారు. ఉప ఎన్నిక జరుగుతున్న ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలో మొత్తం 12 జిల్లాలున్నాయి.