ఇప్పుడు తెలంగాణలో మరో ఉద్యమం మొదలైంది : ఈటల
తెలంగాణ తెచ్చుకుని నీళ్లు, నిధులు, నియామకాలు సాధించుకుంటున్నామని, ఇప్పుడు తెలంగాణలో మరో ఉద్యమం మొదలైందని అన్నారు ఈటల.;
తెలంగాణ తెచ్చుకుని నీళ్లు, నిధులు, నియామకాలు సాధించుకుంటున్నామని, ఇప్పుడు తెలంగాణలో మరో ఉద్యమం మొదలైందని అన్నారు ఈటల. ఈసారి తెలంగాణ ఆత్మగౌరవ ఉద్యమం మొదలవుతుందని అన్నారు. తెలంగాణ తెచ్చింది కుటుంబ పాలన కోసమా అనే అంశంపై మద్దతుగా తనకు నిలిచిన ఎన్‌ఆర్‌ఐలతో ఈటల ఈ వ్యాఖ్యలు చేశారు.
భవిష్యత్ కార్యాచరణపై సన్నిహితులు, కార్యకర్తలతో సమాలోచనలు చేస్తున్న ఈటల రాజేందర్.. ఎన్‌ఆర్‌ఐలతో మాట్లాడారు. తెలంగాణ ఎన్‌ఆఐ అమెరికా ఫోరం ఆధ్వర్యంలో జూమ్ కాన్ఫరెన్స్ జరిగింది. పూర్తిగా తప్పుడు ఆరోపణలతో తనను బయటకు పంపించారని ఎన్‌ఆర్‌ఐలతో అన్నారు ఈటల. సిట్టింగ్ జడ్జితో తన వ్యాపారాలు, సంపాదించిన ఆస్తులపై విచారణ జరిపించండి అని సీఎంను స్వయంగా కోరానని చెప్పారు.
తాను ఎంగిలి మెతుకుల కోసం ఆశపడనని, ప్రజలనే నమ్ముకున్నానని అన్నారు. ప్రలోభాలకు లొంగలేదు కాబట్టే ఈ నిందలు వేస్తున్నారని అన్నారు ఈటల. ఎన్‌ఆర్‌ఐలు తనకు మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు.