Numaish 2022: మళ్లీ ప్రారంభం కానున్న నుమాయిష్.. ఎప్పుడంటే..
Numaish 2022: కరోనా వ్యాప్తితో నిలిచిపోయిన నుమాయిష్ తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ప్రకటించింది.;
Numaish 2022: కరోనా వ్యాప్తితో నిలిచిపోయిన నుమాయిష్ తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ప్రకటించింది.ఈ ఏడాది జనవరి 1న ప్రారంభమై నుమాయిష్.... 45 రోజులు పాటు కొనసాగాల్సి ఉంది. అయితే.. ఒమిక్రాన్ వ్యాప్తితో.. నుమాయిషన్‌ను నిలిపివేయాలని.. ఎగ్జిబిషన్ సొసైటీకీ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆదేశాలు జారీ చేసింది.
ప్రస్తుతం కరోనా కేసులు తగ్గిపోవడం, పరిస్థితులు అదుపులోకి రావడంతో.. ఈ నెల 25నుంచి నుమాయిష్‌ను తిరిగి నిర్వహించాలని నిర్ణయించింది ఎగ్జిబిషన్ సొసైటీ. రోజూ సాయంత్రం.. 4 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు నుమాయిష్ నిర్వహిస్తున్నట్లు తెలిపింది. వీకెండ్‌లో మరో అరగంట పొడిగించి.. 11 గంటల వరకు ప్రదర్శన కొనసాగుతుందని ప్రకటించింది. నుమాయిష్ తిరిగి ప్రారంభం అవుతుండటంతో.. హైదరాబాద్ నగరవాసులు, వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.