హుస్సేన్ సాగర్ లో జరిగిన బోటు పేలిన ఘటనలో తీవ్రంగా గాయపడి సిక్రింద్రాబాద్ యశోధ ఆసుపత్రితో ట్రీట్మెంట్ పొందుతూ గణపతి మృతి చెందాడు. ఈ నెల 26న భరతమాతకు మహాహారతి కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుని బోట్లు దగ్ధం కావడం తెలిసిందే. కాకర్స్ ప్ర మాదంలో గణపతి తీవ్ర గాయాలతో హాస్పి టల్లో చేరగా.. ఇవాళ చనిపోయిన్నట్లుగా డాక్టర్లు ప్రకటించారు. మృతుడు సొంతూరు ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాగా గుర్తించా రు. పోలీసులు డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. రెస్క్యూ ఆపరేషన్ కంటి న్యూ మరోవైపు ట్యాంక్ బండ్ అగ్ని ప్రమాదంలో మిస్ అయిన అజయ్ (21) కోసం కొనసాగుతున్న రెండో రోజు గాలింపు చర్యలు కొనసాగుతు న్నాయి. డీఆర్ఎఫ్, పైర్ సిబ్బందితో పాటు ఎన్ డీఆర్ ఎఫ్ టీమ్లు నిన్న సాయంత్రం నుంచి రెస్క్యూ ఆపరేషన్చేస్తున్నారు. ఇప్పటికే సాగర్ లో బోటింగ్ సేవలను టూరిజం అధికారులు నిలిపివేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసు కున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అగ్ని ప్రమాద కారకులని అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.