కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ పర్యటనతో హైదరాబాద్ గాంధీభవన్ లో సందడి పెరిగింది. శనివారం జరిగే టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఆమె పాల్గొంటారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు బి మహేష్కుమార్ గౌడ్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పోరేషన్ చైర్మన్లు, టీపీసీసీ రాష్ట్రకమిటీ పాల్గొంటుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ పటిష్టత, సంస్థాగతంగా పార్టీ కార్యవర్గం ఏర్పాటు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉందని పార్టీవర్గాలు తెలిపాయి.