బీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. లగచర్ల ఘటనకు సంబంధించి ఆయనపై నమోదైన మూడు ఎఫ్‌ఐఆర్‌లలో రెండింటిని హైకోర్టు కొట్టేసింది. లగచర్ల ఘటన నేపథ్యంలో బొంరాస్‌పేట పోలీసులు నరేందర్ రెడ్డిపై మొత్తం మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఒకే ఘటనపై వేర్వేరు కేసులు నమోదు చేయడాన్ని ఆయన హైకోర్టులో సవాల్ చేశారు. ఆయన పిటిషన్‌పై విచారణ జరిపి తీర్పును రిజర్వ్‌లో పెట్టిన హైకోర్టు శుక్రవారం ఉదయం తాజా ఉత్తర్వులు ఇచ్చింది.