PAWAN: పవన్ నీ సినిమాలు ఆపుతాం: మంత్రి కోమటిరెడ్డి

పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పకపోతే సినిమాలు ఆడబోవని హెచ్చరిక

Update: 2025-12-02 07:45 GMT

ఏపీ డీసీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. పవన్ క్షమాపణలు చెప్పాల్సిందేనని లేకపోతే సినిమాలు ఆపేస్తామని తెలంగాణ మంత్రులు ఘాటుగా స్పందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నా పవన్ సినిమాలు థియేటర్లలో ఆడనివ్వం అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. రాజకీయం అంటే రెండున్నర గంటల సినిమా కాదని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. కోనసీమ కొబ్బరి చెట్లకు తెలంగాణ ప్రజల దిష్టి తగిలిందన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు బాధించాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పకపోతే ఆయన సినిమాలు థియేటర్‌లో విడుదల కాకుండా ఆపేస్తామని హెచ్చరించారు. రాజకీయ అనుభవం లేకే పవన్ ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజల దిష్టి కాదు.. ఆంధ్ర ప్రజల వల్ల తెలంగాణ వాళ్లు ఫ్లోరైడ్ తాగారని అన్నారు.

'పవన్ నీ పనితనం చూపించు'

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజోలులో పవన్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని లేదంటే భవిష్యత్‌లో తెలంగాణలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రెండు ప్రాంతాల మధ్య విద్వేషం పెంచే మాటలు సరికాదని హితవు పలికారు. 'తెలంగాణలో వనరులు వాడుకుని ఈ స్థాయికి ఎదిగావు. మైలేజ్‌ పొందాలంటే పనితనం చూపించు. ఇలా కాదు' అని సూచించారు.

"తెలంగాణ ప్రజలకు పవన్ క్షమాపణలు చెప్పాలి"

తె­లం­గాణ ప్ర­జ­ల­వి ది­ష్టి కం­డ్లు అంటూ వ్యా­ఖ్యా­నిం­చిన ఏపీ డి­ప్యూ­టీ సీఎం పవన్ కళ్యా­ణ్ తె­లం­గాణ ప్ర­జ­ల­కు క్ష­మా­పణ చె­ప్పా­ల­ని జడ్చ­ర్ల ఎమ్మె­ల్యే జనం­ప­ల్లి అని­రు­ధ్ రె­డ్డి డి­మాం­డ్ చే­శా­రు. పవన్ కు ఏపీ పై ప్రేమ ఉంటే తె­లం­గా­ణ­లో ఉన్న ఆస్తు­లు అమ్ము­కొ­ని వి­జ­య­వా­డ­కు వె­ళ్లి­పో­వా­ల­ని, అలా చే­య­కుం­డా కొ­త్త­గా ఇక్కడ ఆస్తు­లు ఎం­దు­కు కొం­టు­న్నా­ర­ని ని­ల­దీ­శా­రు. మె­గా­స్టా­ర్ చి­రం­జీ­వి­కి తమ్ము­డు కా­క­పో­యి ఉంటే పవన్ యా­క్ట­ర్ అయి ఉం­డే­వా­రా ? అని ప్ర­శ్నిం­చా­రు. సా­మా­న్యు­డైన తాను పదే­ళ్ల­కే సీఎం అభ్య­ర్థి అవు­తా­న­ని అం­టుం­టే పవన్ 15 ఏళ్ల తర్వాత సీఎం అవు­తా­నం­టు­న్నా­ర­ని, 70 ఏళ్ల వయ­సు­లో ఆయన సీఎం అయి చే­సే­దే­ముం­ద­ని ఎద్దే­వా చే­శా­రు. తె­లం­గాణ ప్ర­జల ది­ష్టి కం­డ్లు తల­గ­డం కా­ర­ణం­గా గో­దా­వ­రి ప్రాం­తం ఆగ­మై­పో­యిం­దం­టూ పవన్ కళ్యా­ణ్ చే­సిన వ్యా­ఖ్య­ల­పై స్పం­ది­స్తూ శని­వా­రం మీ­డి­యా ప్ర­తి­ని­ధు­ల­తో మా­ట్లా­డిన అని­రు­ధ్ రె­డ్డి పవన్ కళ్యా­ణ్ ను ఉద్దే­శిం­చి సం­చ­లన వ్యా­ఖ్య­లు చే­శా­రు.

Tags:    

Similar News