స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దివ్యాంగులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పిల్ దాఖలవగా, పిటిషనర్‌కు ఉన్న అర్హతను కోర్టు ప్రశ్నించింది. పిటిషనర్ దివ్యాంగురాలని అడ్వొకేట్ తెలపడంతో, పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. ‘ఆల్ ఇండియా సర్వీసుల్లో దివ్యాంగుల కోటా అవసరమా?’ అని స్మిత ప్రశ్నించడం వివాదమైన సంగతి తెలిసిందే. వికలాంగులను 'సంకుచిత దృక్పథం'తో చూడరాదని, వారి అర్హతపై ఇలా మాట్లాడటం సరికాదని స్మితా సబర్వాల్ వైఖరీపై మండిపడుతున్నారు. దీనిపై శ్రీకాంత్ మిర్యాల అనే రచయిత, సైకియార్టిస్ట్ ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ఈ పోస్టులో ప్రత్యక్ష ఉదాహరణలతో గతంలో ఎంబీబీఎస్ చదివేటప్పుడు తన ప్రిన్సిపాల్ కాలుకి పోలియో సోకి సరిగా నడవలేనివారు, అయినా కూడా ఎడమచేత్తో రాసి, పాఠాలు చెప్పారని గుర్తు చేశారు. ఇలా చాలా మంది దివ్యాంగులు పలు రంగాల్లో ఉన్నట్లు గుర్తు చేశారు.