Telangana: పోడు పట్టాలను పంపిణీ చేసిన కేటీఆర్
పోడు రైతులకు 67వేల 730 ఎకరాలకు పోడు పట్టాలను పంపిణీ చేశారు;
మహబూబాబాద్ జిల్లాలోని గుమ్మడూరులో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఇందులో భాగంగా 24వేల 181 మంది పోడు రైతులకు 67వేల 730 ఎకరాలకు పోడు పట్టాలను పంపిణీ చేశారు. అదేవిధంగా రామచంద్రాపురం కాలనీలో 200 డబుల్ బెడ్‌రూం ఇండ్లను ప్రారంభించి లబ్దిదారులకు ఇంటిపేపర్లను అందజేశారు. అంతకుముందు మానుకోటలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద 50కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ది పనుల పైలాన్‌ను ఆవిష్కరించారు.
జులై 8న మోదీ వరంగల్ పర్యటన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ పలు ప్రశ్నలు సంధించారు. మెడికల్ కాలేజీలు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వేకోచ్ ఇవ్వమని మోదీ ఎందుకు వస్తున్నారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలతో ఏర్పడిన తెలంగాణలో ఇప్పుడు సీఎం కేసీఆర్ వల్లే పోడు రైతులకు పట్టాలు వస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపడితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎలాంటి సహాయం చేయడం లేదంటూ మండిపడ్డారు.