ఎన్నికల కోడ్ (Election Code) అమలులో ఉండటంతో పోలీసులు నేతల వాహనాలను తనిఖీ చేస్తున్నారు. తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు.
మధిర మండలం ఆత్కూర్ క్రాస్ వద్ద భట్టివిక్రమార్క వాహనాన్ని పోలీసులు ఆపి తనిఖీ చేశారు. వాహనం ఆపి తనిఖీలు పూర్తయ్యే వరకు భట్టివిక్రమార్క వాహనంలో కూర్చొని సహకరించారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో పోలీసులు వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు.
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో కూడా విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఆర్టీసీ బస్సులు, కార్లు, జీపులు, ఆటోలు ఇతర వాహనాలను తనిఖీలు చేశారు. ఎన్నికల నిబంధనల మేరకు ఓ వ్యక్తి వద్ద రూ.50వేలకు మించి నగదు ఉంటే సీజ్ చేస్తున్నారు అధికారులు. అన్ని వాహనాలను పరిశీలిస్తున్నారు.