Former BRS MLA Shakeel : షకీల్‌ను అదుపులోకి తీసుకుని విడిచిపెట్టిన పోలీసులు
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు కేసుల్లో ఆయనపై అరెస్ట్ వారెంట్ ఉండటంతో దుబాయ్ నుంచి వచ్చిన ఆయన్ను అదుపులోకి తీసుకుంటున్నట్లు చెప్పారు. అయితే తల్లి అంత్యక్రియల కోసం వచ్చానని చెప్పడంతో వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. అంత్యక్రియల తర్వాత ఆయనకు నోటీసులు ఇవ్వనున్నారు. కొద్ది నెలలుగా షకీల్ దుబాయ్‌లో ఉంటున్నారు.
2022-23 మధ్య హైదరాబాద్‌లోని ప్రజాభవన్ ముందు.. భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఇది అప్పట్లో తెల్లవారుజామున జరిగింది. అయితే.. ఈ ఘటనకు షకీల్ కుమారుడే కారణమని పోలీసులు గుర్తించి.. కారును స్వాధీనం చేసుకున్నారు. అయితే.. అదేసమయంలో అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. షకీల్ కుమారుడు సాహిల్..ఈ ఘటనకు బాధ్యుడైన ఆయన స్నేహితుడు.. ఆ వెంటనే విదేశాలకు వెళ్లిపోయారు.