హైదరాబాద్ బాచుపల్లి పీఎస్ పరిధిలోని టకీలా పబ్‌పై బాచుపల్లి పోలీసులు దాడులు నిర్వహించారు. కేవలం బార్ పర్మిషన్‌తో టకీల పబ్ నిర్వహణపై సీరియస్ అయ్యారు. టకీల పబ్ లోని మ్యూజికల్ ఎక్విప్‌మెంట్‌తో పాటు రెండు ల్యాప్ టాప్‌లను సీజ్ చేశారు. బార్ పర్మిషన్ తీసుకుని డ్యాన్స్ ఫ్లోర్స్, మ్యూజికల్ నైట్స్, కార్పొరేట్ ఈవెంట్స్ ఎలా చేస్తున్నారని మండిపడ్డారు. బార్ పర్మిషన్ తీసుకున్న యజమాని వివరాలు తీసుకున్నారు. బార్ అని బోర్డు పెట్టి లోపల పబ్ నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు ఎవరైనా సరే చేపడితే సహించేది లేదని తెలిపారు.