బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్‌పాకాల ఇంట్లో పార్టీ వ్యవహారంపై విచారణ ముమ్మరం అయ్యింది. పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్ సన్నిహితుడు విజయ్ మద్దూరి ఇంట్లో పోలీసులు సోదాలు చేపట్టారు. పోలీసుల విచారణకు మద్దూరి సహకరించడం లేదని తెలుస్తోంది. రైడ్ సమయంలో అతడి ఫోన్ బదులు మరో మహిళ ఫోన్‌ను పోలీసులకు ఇచ్చినట్లు సమాచారం. అయితే పరీక్షల్లో విజయ్ మద్దూరికి పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూపీ లాగుతున్నట్లు సమాచారం. విజయ్‌మద్దూరికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయన్న కోణంలో ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.