Miryalaguda : ఆర్టీసీ బస్సుకు నిప్పు పెట్టిన దుండగులు.. పోలీసుల గాలింపు
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆకతాయిలు రెచ్చిపోయారు. పార్కింగ్‌లో ఉన్న నైట్‌హాల్ట్ ఆర్టీసీ బస్సుకు నిప్పు పెట్టారు. తడకమళ్ల గ్రామంలో అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. మిర్యాలగూడ డిపోకు చెందిన బస్సు రోజు మాదిరిగానే గ్రామంలోని ప్రధాన బస్‌స్టాప్ సర్కిల్లో పార్కింగ్ చేశారు. అయితే గుర్తుతెలియని వ్యక్తులు బస్సు వెనుకవైపు నిప్పంటించడంతో మంటలు చెలరేగాయి. వెంటనే అలర్ట్ అయిన డ్రైవర్, కండక్టర్.. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ ఇంజిన్‌తో సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో బస్సు వెనుక భాగం టైర్లతో సహా పూర్తిగా దగ్ధమైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. నిప్పుపెట్టిన ఆకతాయిల కోసం గాలింపు చేపట్టారు.