వరంగల్ జిల్లాలో పోలీసు భార్యలు రోడ్డెక్కారు. కర్ణాటక, తమిళనాడు తరహాలో ఏక్ పోలీస్ విధానాన్ని అమలు చేయాలని రోడ్డుపై పిల్లలతో బైఠాయించారు. 3 నుంచి ఐదేళ్లు ఒకే దగ్గర పోస్టింగ్ ఉండేలా ఫ్యామిలీ వెసులుబాటు కల్పించాలన్నారు. బెటాలియన్‌కు 30 కిలోమీటర్ల పరిధిలో పోస్టింగ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆర్డర్లీ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బ్రిటీష్ కాలం నాటి మాన్యువల్‌ను తీసేసి దాని స్థానంలో ప్రస్తుత కాలానికి అనుగుణంగా సవరించాలని కోరారు.