కరీంనగర్ లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మంత్రి గంగుల కమలాకర్ కు అత్యంత నమ్మిన బంటు గుగ్గిలపు రమేష్. గతంలో ఎన్నో కీలక పదవులు అప్పగించారు. కానీ మంత్రికి ఒక్క మాట చెప్పకుండా అతడు పార్టీ మారడంతో గంగుల అలర్ట్ అయ్యారు. వెంటనే నగర పాలక సంస్థ కార్పొరేటర్లతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు గంగుల. స్వార్థ పరులే పార్టీని వీడుతారని.. ఎవరూ అధైర్య పడొద్దని భరోసా నింపారు.
తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం టీఆర్ఎస్ లోనే ఉంటాను అన్నారు. పదవులు ఉన్నా లేకున్నా కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తానన్నారు. మంత్రి పదవి ఇచ్చిన సీఎం కేసీఆర్ తనకు దేవుడితో సమానం అన్నారు గంగుల.