మొదలైన బదిలీల పర్వం.. రసవత్తరంగా కరీంనగర్ రాజకీయాలు

మంత్రివర్గం నుంచి ఈటెల రాజేందర్ బర్తరఫ్ తరువాత కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో బదిలీల పర్వం కొనసాగుతోంది.

Update: 2021-05-09 12:30 GMT

మంత్రివర్గం నుంచి ఈటెల రాజేందర్ బర్తరఫ్ తరువాత కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో బదిలీల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ఎసీపీ, ఆర్డీవోలను బదిలీ చేసిన ప్రభుత్వం తాజాగా నియోజకవర్గంలోని నాలుగు మండలాల తహశీల్దార్లు, ఎంపిడివోలు, జమ్మికుంట సీఐలకి స్థాన చలనం కల్పించింది. మిగిలిన శాఖల్లో కూడా అధికారులను ప్రభుత్వం బదిలీ చేసే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలో రాజకీయ పరిణామాలు రసవత్తరంగా మారాయి. ఈటెల బర్తరఫ్ తర్వాత ఈటల వైపు కొందరు.. టీఆర్ఎస్ పార్టీ వైపు మరికొందరు చీలిపోయారు దీంతో టీఆర్ఎస్ అధిష్టానం వేగంగా పావులు కదుపుతోంది. పార్టీ క్యాడర్ ను కాపాడుకునేందుకు ప్రయత్నాల్లో పడింది. దీంతోపాటు నియోజకవర్గంలో ఉన్న అధికారులను ఒక్కొక్కరిగా బదిలీ చేస్తుంది.


Full View


Tags:    

Similar News