TRS: టీఆర్‌ఎస్ పార్టీకి షాక్.. బీజేపీలో చేరనున్న ఆ ఇద్దరు సీనియర్ నేతలు..
TRS: అధికార TRS పార్టీకి ఇద్దరు సీనియర్ నేతలు షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.;
TRS: అధికార TRS పార్టీకి ఇద్దరు సీనియర్ నేతలు షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటితో పాటు వేణుగోపాల చారి బీజేపీతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో మంతనాలు కూడా పూర్తయ్యాయని తెలుస్తోంది. అధిష్టానం కూడా వారి చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది. అన్ని కుదిరితే ప్రజా సంగ్రామ పాదయాత్ర ముగింపు సభలో బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా TRS అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు పొంగులేటి .