మహా నాయకురాలు ఇందిరాగాంధీ ఇచ్చిన స్ఫూర్తిగా దేశ యువత నడుం బిగించాలన్నారు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. దేశ ఐక్యత కోసం జాతీయ భావం, అభివృద్ధి పేదల పట్ల పూర్తి శ్రద్ధ అన్ని రకాల అంశాలను ప్రాధాన్యత ఇచ్చిన ఇందిరా గాంధీ స్ఫూర్తి ప్రపంచ స్థాయిలో నిలిచిన నాయకురాలు అని కొనియాడారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావుతో కలిసి నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహానికి మంత్రి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రజాస్వామ్యంలో అనేక సంస్కరణలు చేసి ప్రజాహిత నిర్ణయాలు తీసుకొని ఈ దేశ ప్రజలకు అమ్మగా ఇందిరా గాంధీ చిరస్మరణీయం అని మంత్రి పొన్నం తెలిపారు. యువత ముఖ్యంగా మహిళలు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఏ విధంగా తమ తమ రంగాల్లో వృత్తి వ్యవహారపరంగా ఎలా ఉండాలో ఇందిరమ్మ ఆదర్శమన్నారు.