Telangana : మహమ్మారి వెంటాడుతుంది.. భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత..

Update: 2025-07-14 11:30 GMT

సికింద్రాబాద్‌ బోనాల ఉత్సవాలు అట్టహాసంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ‘రంగం’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మాతంగి స్వర్ణలత భక్తులకు భవిష్యవాణి వినిపించారు. రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడే భారం తనదేనని చెప్పారు. రాబోయే రోజుల్లో మహమ్మారి వెంటాడుతుందని, అగ్నిప్రమాదాలు కూడా సంభవిస్తాయని తెలిపారు. జాగ్రత్తగా ఉండాలని భక్తులను హెచ్చరించారు. ఈ ఏడాది వర్షాలు మంచిగా కురుస్తాయని, పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని చెప్పారు. ‘‘బాలబాలికలను విచ్చలవిడిగా వదిలేస్తే.. నేను కడుపులో పెట్టుకుని కాచుకుంటున్నానని తెలిసారు. ‘‘ఈసారి చాలా సంతోషంగా పూజలు చేశారు. మీ అందరినీ సంతోషంగా సమానంగా చూస్తాను. అరికాలిలో ముల్లు నాలుకతో తీస్తాను. కాలం తీరితే ఎవరు ఏది అనుభవించాలో అది అనుభవిస్తారు, నేను అడ్డురాను’’ అని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. వర్షాలు మంచిగా పడతాయని చెప్పడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Full View

Tags:    

Similar News