హైదరాబాద్‌లోని సచివాలయ భవనంలో సందర్శకుల కదలికలను నియంత్రించేందుకు అధికారులు కొత్త విధానాన్ని తీసుకువస్తున్నారు. త్వరలోనే ‘విజిటర్ ఈ-పాస్ మేనేజ్‌మెంట్ సిస్టం’ను అమలు చేయనున్నారు. ఈ విధానంలో ప్రతి సందర్శకుడికీ QR కోడ్‌తో కూడిన డిజిటల్ పాస్ జారీ చేయబడుతుంది. దరఖాస్తుదారుల పూర్తి వివరాలు ఈ పాస్‌లో నమోదవుతాయి. వారు సచివాలయానికి వచ్చిన సమయం, ఉన్నంత వ్యవధి, బయలుదేరిన సమయం తదితర సమాచారాన్ని నమోదు చేస్తారు. ఈ వ్యవస్థ ద్వారా మంత్రులు లేదా వారి కార్యాలయాలకు ఇచ్చిన వినతుల్లో ఎంత శాతం పరిష్కారమవుతున్నాయో పర్యవేక్షించవచ్చని అధికారులు తెలిపారు. భద్రత, పారదర్శకత పెంపుతో పాటు సందర్శకుల లాగ్‌ను ట్రాక్ చేయడం ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యం. త్వరలోనే ఈ-పాస్‌ల వినియోగం ప్రారంభం కానుంది. ఈ కొత్త విధానం వల్ల అకారణ సందర్శనలకు అడ్డుకట్టపడనుంది. ప్రతి విజిట్‌పై పూర్తిస్థాయిలో నిఘా ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదంతా ప్రభుత్వ పరిపాలనలో జవాబుదారీతనాన్ని పెంచేందుకు చేస్తున్న ప్రయత్నంగా చెబుతున్నారు.