TG : తెలంగాణ పూర్తి స్థాయి గవర్నర్‌గా రాధాకృష్ణన్?

Update: 2024-06-27 04:58 GMT

తెలంగాణ పూర్తి స్థాయి గవర్నర్‌గా ఇన్‌ఛార్జ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను ( CP Radhakrishnan ) కొనసాగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాధాకృష్ణన్ ఝార్ఖండ్ గవర్నర్‌గా కొనసాగుతున్నారు. పుదుచ్చేరికి కూడా ఆయన ఇన్‌ఛార్జ్ గవర్నర్‌గా ఉన్నారు. తనను తెలంగాణ పూర్తి స్థాయి గవర్నర్‌గా కొనసాగించాలని ఇటీవలే హోంమంత్రి అమిత్ షాను రాధాకృష్ణన్ కోరినట్లు సమాచారం. ఇందుకు ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాగా త‌మిళిసై గ‌వ‌ర్నర్ ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో ఆ బాధ్యత‌ల‌ను రాధాకృష్ణన్‌కు అప్పగించారు.

2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. అప్పుడు ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ గా ఈఎస్ఎల్ నరసింహన్ కొనసాగారు. ఆ తర్వాత బీజేపీ తమిళనాడు అధ్యక్షురాలిగా కొనసాగిన తమిళిసై సౌందర రాజన్ ను తెలంగాణ గవర్నర్ గా కేంద్రం నియమించింది. పార్లమెంటు ఎన్నికలకు ముందు ఆమె గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. దీంతో జార్ఖండ్ గవర్నర్ గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ ను కేంద్రం తెలంగాణ ఇన్ చార్జి గవర్నర్ గా నియమించింది. దాదాపు మూడు నెలలుగా సీపీ రాధాకృష్ణన్ ఇన్ చార్జి గవర్నర్ గా కొనసాగుతున్నారు.

Tags:    

Similar News