తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ చేసిన తప్పులనే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేస్తున్నారని ఎంపీ రఘునదన్ రావు అన్నారు. పదేళ్ల పైశాచిక పాలనలో బీఆర్‌ఎస్ అర్థరాత్రి రైతులను అరెస్ట్ చేసింది..కాంగ్రెస్ కూడా రైతులను అర్థరాత్రి అరెస్ట్ చేస్తున్నారని విమర్శించారు. మారింది కేవలం రంగుల జెండా మాత్రమే..రైతుల బతుకుల్లో మార్పురాలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేరులోనే కాకుండా పాలనలో ప్రజా పాలన కనబర్చాలన్నారు రఘునందన్‌రావు.