Rain Alert : తెలంగాణకు నాలుగు రోజుల పాటు వర్షసూచన.. సాయంకాలాల్లో రెయిన్ అలర్ట్
తెలంగాణలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణకు ఆనుకొని ద్రోణి ఏర్పడిందని, ఉపరి తల అవర్తనం కారణంగా రాష్ట్రంలో తేమ గాలులు వీస్తున్నాయని చెప్పింది. ఆ గాలుల్లోని ఆవిరి మేఘాలు ఏర్పడి సాయంత్రం వర్షాలు పడుతున్నాయని, తిరిగి ఉదయం సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే మూడు, నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో ఇదేతరహా భిన్నమైన వాతావరణం ఉంటుందని పేర్కొన్నారు. రాజస్థాన్ నుంచి కోస్తాకు వెళ్తున్న ఉపరితల అవర్తనం కారణంగా తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ సమయంలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు, జల్లులు పడతాయని చెప్పింది. పశ్చిమ మధ్య బంగాళా ఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం శుక్రవారం బలహీనపడిందని హైదరా బాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతంలో సగటు సముద్రమట్టం నుంచి 1.5 కి.మీ. ఎత్తులో కొనసాగుతోందని తెలిపింది.
రాష్ట్రంలో మూడు రోజులు పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడ్డాయి. దీంతో ఉత్తర తెలంగాలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. అదే సమయంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల వరకూ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయన్నారు. శనివారం పలు జిల్లాల్లో తెలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపారు. దీనికి తోడు ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. రాబోయే నాలుగు రోజులు కూడా గత 30 ఏళ్ల నుంచి ఉష్ణోగ్రతలకు అటుఇటుగా 1 డిగ్రీ పెరిగే అవకాశముందని పేర్కొంది. గతేదాడి ఏప్రిల్తో పోలిస్తే 1 నుంచి 2 డిగ్రీల వరకూ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.